రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, సహాయం కోరేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పార్లమెంట్‌కు చేరుకున్నారు.
టీడీపీ ఎంపీలు వీరికి స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయ్యారు.
మంత్రులు లోకేష్, అనిత మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘మొంథా’ తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనాకు సంబంధించిన సమగ్ర నివేదికను వారికి అందించనున్నారు. మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి, తుఫాను నష్టాన్ని పూడ్చేందుకు మరియు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.