ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (CS) సీనియర్ ఐఏఎస్ అధికారి G. సాయి ప్రసాద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుండటంతో, ప్రభుత్వం ఇప్పటికే సాయి ప్రసాద్‌ను ఆ పదవికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం 11:33 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపడతారు
1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన సాయి ప్రసాద్ ఎంటెక్ పట్టభద్రులు.ఉమ్మడి ఏపీలో కర్నూలు, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. విద్యుత్ రంగంలో ఎపి ట్రాన్స్‌కో జెఎండిగా, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్ సిఎండిగా విశేష సేవలు అందించారు.కేంద్ర ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా, సీఎం కార్యదర్శిగా మరియు ముఖ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మరియు సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.పరిపాలనలో అపార అనుభవం ఉన్న సాయి ప్రసాద్ నియామకంపై రాష్ట్ర ఉన్నతాధికార వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
