విశాఖ నగర పరిధిలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గల తుంగలం వద్ద రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.

ఈ దాడుల్లో పందాలు ఆడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15,000 రూపాయల నగదు మరియు రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు
