గంజాయి రవాణా,విక్రయాలను అరికట్టే ప్రత్యేక నిఘాలో భాగంగా అరండల్‌పేట పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
డిసెంబర్ 11, 2025న మధ్యాహ్నం 1:15 గంటలకు బ్రాడీపేట 1వ లైనులోని నిర్మానుష్య ప్రదేశంలో విక్రయాలకు ప్రయత్నిస్తుండగా C.I k.ఆరోగ్య రాజు సిబ్బందితో కలిసి దాడి చేశారు.
అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తుల నుంచి 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాలపర్తి కిరణ్ (గుంటూరు), కట్రవత్ సందీప్ నాయక్ (నంద్యాల), కట్రవత్ సంపత్ నాయక్ (నంద్యాల).
నిందితులు అరకు సమీపంలోని పాడువ గ్రామానికి చెందిన ‘డాన్’ అనే వ్యక్తి నుంచి ₹15,000కు 3 కిలోల గంజాయి కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారు. అందులో 2 కిలోలు విక్రయించి, మిగిలిన 1.150 కిలోలు అమ్మడానికి గుంటూరు తీసుకొచ్చారు. NDPS చట్టం కింద Cr.No.: 872/2025 కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసును ఛేదించిన సీఐ ఆరోగ్య రాజు, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ మరియు వెస్ట్ డీఎస్పీ కె. అరవింద్ అభినందించారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు.
