నగరంలోని ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రగతి నగర్లో పోలీసులు శనివారం తెల్లవారుజామున భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెర్చ్ ఆపరేషన్లో పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేరాల నియంత్రణే ధ్యేయంగా ఈ ఆపరేషన్ నిర్వహించామని డీఎస్పీ తెలిపారు. అనుమానిత వ్యక్తులు కాలనీల్లో కనిపిస్తే తక్షణమే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచినట్లు స్పష్టం చేశారు.
Ap గుంటూరు ప్రగతి నగర్లో కార్డెన్ సెర్చ్ 28 వాహనాలు సీజ్
