వ్యభిచార వృత్తితో పాటు చోరీలు చేస్తున్న ఒక మహిళా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరుకు చెందిన అనిత అనే మహిళ, తన భర్తతో విడిపోయి, ఆయాగా పనిచేస్తూ ఆదాయం సరిపోక, వ్యభిచారం చేస్తూ జీవనం సాగిస్తోంది.
అనిత, కరిముల్లా, సాయి సంతోష్, గోపి, చందునాయక్లతో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంది.వీరు అనితకు పరిచయస్తురాలైన మద్రాసు సరస్వతి ఇంట్లో దాదాపు పది లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు.
చోరీ జరిగిన నాలుగు నెలల తర్వాత పోలీసులు కేసును ఛేదించి, అనితతో పాటు మొత్తం ముఠాను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు ఈ ముఠాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు
