ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి 333 మంది యాత్రికులు రెండు దఫాలుగా మక్కా ప్రయాణం చేయనున్నారు.

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 18న మొదటి విడతలో 156 మంది, 19న రెండో విడతలో 177 మంది బయలుదేరనున్నారు. మిగతా యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల నుంచి ప్రయాణం చేయనున్నారు.

హజ్ యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించింది. అలాగే విజయవాడలో ముందుగానే చేరే యాత్రికులకు వసతి, భోజనం, పురుషులు–మహిళలకు వేరువేరు సౌకర్యాలు కల్పించారు.గన్నవరం విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలను మంత్రి ఫరూక్ పరిశీలించారు. మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో హజ్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి యాత్రికులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, భోజనంలో పాల్గొన్నారు.
