మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్పై సామాజిక కార్యకర్త, ఆర్టీఐ జిల్లా కో-ఆర్డినేటర్ అర్జున్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఎన్కౌంటర్ ముమ్మాటికీ బూటకపుదే అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అర్జున్ రెడ్డి ఆరోపణలు:
హిడ్మా దంపతులను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపేశారని అర్జున్ రెడ్డి సూటిగా ఆరోపించారు. అణగారిన వర్గాలకు సరైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు, రాజకీయ నాయకులు విఫలమైనప్పుడే నక్సలిజం పుట్టుకొస్తుంది అని ఆయన పేర్కొన్నారు. నక్సలైట్లు, పోలీసులు కాల్చుకుని చంపుకోవడం అనేది ఈ రెండు వర్గాల సమస్య కాదని, రాజకీయ వ్యవస్థలో అవినీతి, దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయని అన్నారు.
అధికారులు, రాజకీయ నాయకులు ప్రజలకు సరిగా పరిపాలన అందిస్తే, నక్సలిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు అని అర్జున్ రెడ్డి స్పష్టం చేశారు.
