రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పారదర్శకత పెంచేందుకు ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
ఉండవల్లి నివాసంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు, సిబ్బంది వివరాలు సేకరణపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను సమీక్షించారు.నాణ్యమైన విద్యా బోధనకు ముఖ ఆధారిత హాజరు విధానం ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
