ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికారు.ఆలయ అధికారులు దగ్గరుండి హోం మంత్రికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆమె ఆలయ నిబంధనల ప్రకారం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందజేశారు. TTD అధికారులు హోం మంత్రికి స్వామివారి శేష వస్త్రంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, శాంతిభద్రతలు సజావుగా సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
