రాష్ట్రంలోని మూడు ఏరియా ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.22.74 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది.
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగానికి ఈ నిధులను కేటాయించారు. మంగళగిరి, పిఠాపురం, చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రుల అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు.
ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిధులు ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడతాయి.
