AP సాంఘిక సంక్షేమ శాఖకు జ్ఞానభూమికి స్కోచ్ ప్లాటినం అవార్డు

March 28, 2026 3:00 PM

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న జ్ఞానభూమి పోర్టల్‌కు ప్రతిష్టాత్మక స్కోచ్ ప్లాటినం అవార్డు లభించింది.

ఢిల్లీలో జరిగిన 106వ Skoch Awards కార్యక్రమంలో ఈ అవార్డును B. Lavanya Veni స్వీకరించారు.జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ అడ్మిషన్లు, అంబేద్కర్ ఓవర్సీస్, విద్యోన్నతి వంటి పథకాలు రియల్ టైంలో అందిస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది.ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి Dola Sri Bala Veeranjaneya Swamy అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పేద విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media