జిల్లా పోలీసు యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కడప జిల్లాలో భారీ సంఖ్యలో సబ్ ఇన్‌స్పెక్టర్ల (ఎస్సై)ను బదిలీ చేస్తూ కర్నూల్ రేంజి D.I.G కోయ ప్రవీణ్ గారు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పలువురు ఎస్సైలకు TRANSFERS చేశారు.
ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని, బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని D.I.G కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు.
పరిపాలనా సౌలభ్యం,ఆయా ప్రాంతాల్లో సమర్థవంతమైన శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఈ బదిలీలు జరిగినట్లు సమాచారం.

