AP:కమిషన్ ఇస్తేనే కండలేరు పరిహారం గుండవోలు రైతుల ఆరోపణ

February 21, 2026 6:09 PM

కండలేరు జలాశయం ముంపు బాధితులకు అందాల్సిన నష్టపరిహారం విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని రాపూరు మండలం గుండవోలు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు తమను మోసం చేస్తున్నారని శనివారం రైతులు మీడియా ముందు వాపోయారు.

గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పరిహారం ఇప్పిస్తానని నమ్మబలికి, ఖాళీ స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నాడని రైతులు ఆరోపించారు. కలెక్టర్‌కు సమర్పించిన 82 మంది లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవని, పేరు చేర్చాలంటే రూ. 50,000 కమిషన్ ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు రైతులు శేఖర్, మోహన్ వెల్లడించారు. ముంపునకు గురైన అసలైన పొలాలను వదిలి, జలాశయానికి సంబంధం లేని ప్రాంతాలకు పరిహారం మంజూరు చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు.తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు స్పందించి, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media