Krishna districtలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. V. Vidyasagar Naidu తెలిపిన వివరాల ప్రకారం, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని రహస్యంగా తరలిస్తూ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Thotlavalluru ప్రాంతంలో వాహనాల తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న టాటా ఇండికా కారును తనిఖీ చేయగా 26 పాలిథిన్ కవర్లలో మొత్తం 52 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మూడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.నిందితులు తెనాలి ప్రాంతానికి చెందిన మునుబోటి ఈశ్వర ప్రసాద్, తమిళనాడుకు చెందిన దురై మోహన్ కుమార్, విశాఖపట్నం జిల్లా వడ్డాది ప్రాంతానికి చెందిన అల్లా అమీన్‌గా గుర్తించారు. వీరు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి గ్రామీణ మార్గాల ద్వారా రహస్యంగా తరలించేందుకు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై NDPS చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే 1972 హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
