పోలీసుల కళ్లు గప్పి గంజాయి సాగు చేయాలనుకున్న ఓ రైతుకు ఊహించని షాక్ తగిలింది. దేవుడి భూమిలో అంతర పంటగా గంజాయి మొక్కలను పెంచుతున్న రైతు గుట్టును పోలీసులు రట్టు చేశారు.
కర్నూలు జిల్లాలో ఓ రైతు దేవుడి భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో మిరప, కంది పంటలను సాగు చేస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా వాటి మధ్యలో గంజాయి చెట్లను పెంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహించారు. దట్టంగా పెరిగిన గంజాయి చెట్లను చూసి అధికారులు సైతం విస్తుపోయారు.

తోటలో ఉన్న సుమారు 300 గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. వీటితో పాటు 5 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, సదరు రైతును అదుపులోకి తీసుకున్నారు.
