రైతులకు, ప్రజలకు అబద్ధాలతో తప్పుదారి పట్టిస్తున్న వైఎస్ జగన్ పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. టెక్కలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ఐదేళ్ల జగన్ తుగ్లక్ పాలనే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసింది. వైఫల్యాలను దాచిపెట్టడానికి జగన్ ‘అబద్ధాల అంబాసిడర్’లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లో చేసిన అభివృద్ధి, జగన్ ఐదేళ్ల పాలన అబద్ధాలను బట్టబయలు చేసిందని అన్నారు.
గత ప్రభుత్వం చెల్లించని రూ. 1,674 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వమే వెంటనే చెల్లించింది.
రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్‌కు మాట్లాడే అర్హతే లేదని స్పష్టం చేశారు.
రైతు ఆత్మహత్యల కుటుంబాలకు గత ప్రభుత్వం చెల్లించని పరిహారాలను కూటమి ప్రభుత్వం వెంటనే అందజేసింది.
రైతులకు తక్షణ మార్కెట్ జోక్యం అందించేందుకు 16 నెలల్లో రూ. 800 కోట్లకు పైగా మద్దతు ధరల రూపంలో ఖర్చు చేశామని మంత్రి తెలిపారు.
రైతుల సమస్యలు, వాస్తవాలపై బహిరంగ చర్చకు జగన్‌తో తాను సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు సవాలు విసిరారు.
మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పారదర్శకంగా, శాస్త్రీయంగా ఉంటుందని, వ్యవసాయ రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపేలా పునరుజ్జీవింపజేస్తోందని తెలిపారు.
