ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కుంభకోణంలో ముంబై వ్యాపారి అనిల్ చోఖ్రా ప్రధాన లింక్‌గా తేలడంతో, ఆయనను 49వ నిందితుడిగా చేర్చారు.
సిట్ అధికారులు ముంబైలో విచారణ జరిపి, డొల్ల కంపెనీల ద్వారా వందల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చిన ఆధారాలు సేకరించారు. విచారణలో చోఖ్రా మనీ లాండరింగ్ వ్యవహారాన్ని కొంతవరకు అంగీకరించినట్లు సమాచారం.చోఖ్రాకు ఇంతకుముందు కూడా మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ అరెస్టులు జరిగాయి. ఇప్పుడు మరోసారి పేరు బయటకు రావడంతో కేసు సంచలనం సృష్టించింది. సిట్ త్వరలోనే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

