పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలో రాజకీయ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ మరియు వైసీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రైతు భరోసా కేంద్రం (RBK) వద్ద టీడీపీకి చెందిన అంజిరెడ్డి, నాగిరెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఈ పాత కక్షలను మనసులో ఉంచుకుని, వైసీపీకి చెందిన పలువురు వ్యక్తులు టీడీపీ నాయకుడు దుర్గంపూడి అంజిరెడ్డిపై దాడికి దిగారు.

ఈ దాడిలో అంజిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణలో గాయపడిన అంజిరెడ్డితో పాటు మరో వ్యక్తి హరినాథ్ రెడ్డిని వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాచర్ల రూరల్ ఎస్సై సంధ్యారాణి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. గ్రామంలో అశాంతి సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరూ చట్టాన్ని అతిక్రమించవద్దని ఆమె హెచ్చరించారు.

