AP:మండపేట విద్యార్థిని గౌరి జష్విక అంతర్జాతీయ కీర్తి

March 18, 2026 2:25 PM

మండపేటలోని ఆశ్రమ్ పాఠశాల విద్యార్థిని గౌరి జష్విక అంతర్జాతీయ వేదికపై అద్భుత విజయాలు సాధించి అందరి ప్రశంసలు పొందుతోంది. చిన్న వయసులోనే తన చిత్రకళా ప్రతిభతో 10 అంతర్జాతీయ రికార్డులు, 6 బంగారు పతకాలు సాధించి పాఠశాలకే కాక రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

ఢిల్లీకి చెందిన పోటీల్లో కేవలం 45 నిమిషాల్లో ‘శివతాండవం’ చిత్రాన్ని గీసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ముంబైలో జరిగిన రంగోత్సవ్ ఆర్ట్ కాంపిటీషన్‌లో 4 బంగారు పతకాలు, 2025 అంతర్జాతీయ పోటీల్లో మరో 2 బంగారు పతకాలు సాధించింది.సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ‘జీవవైవిధ్యం’ అంశంపై ఆమె గీసిన చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రతిభకు గుర్తింపుగా జష్వికకు ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం లభించింది.చదువుతో పాటు కళల్లోనూ ప్రతిభ చూపుతున్న జష్విక భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media