ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు.

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు వైసీపీ కార్యకర్తలు, విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. సేకరించిన కోటి సంతకాల ప్రతుల బాక్సులను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ నిర్ణయంపై ఒత్తిడి పెంచాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది.

