పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో దేశభక్తి చాటేలా ఏర్పాటు చేసిన 100 అడుగుల భారీ జాతీయ జెండాను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. సత్తెనపల్లి నడిబొడ్డున ఎత్తైన పోల్‌పై విద్యుత్ కాంతుల మధ్య మువ్వన్నెల జెండాను మంత్రి ఆవిష్కరించారు.

జెండా ఆవిష్కరణ సమయంలో విద్యార్థులు సామూహికంగా ఆలపించిన జాతీయ గీతం గీతం సభికులలో ఉద్వేగాన్ని నింపింది. జాతీయ జెండా మన ఆత్మగౌరవానికి ప్రతీక అని, యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

