AP:FPOలను బలోపేతం చేయాలి మంత్రి శ్రీనివాస్

February 5, 2026 5:59 PM

గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPOs) స్వయం సమృద్ధి సంస్థలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరియు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం విజయవాడలోని సెర్ప్ ప్రధాన కార్యాలయంలో ఎన్జీవోలు, అధికారులతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రతి ఎఫ్.పి.ఓ ఒక ప్రత్యేక ఉత్పత్తిపై దృష్టి సారించి వాల్యూ చైన్ అభివృద్ధి చేయాలని, దీనికోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.ఎఫ్.పి.ఓల బలోపేతానికి ప్రత్యేక ‘టూల్’ అభివృద్ధి చేయాలని, విజయవంతమైన సంస్థల వివరాలను వీడియో డాక్యుమెంటరీలుగా రూపొందించాలని సూచించారు.NGO ప్రతినిధులు సంబంధిత జిల్లాల ప్రాజెక్ట్ డైరెక్టర్లతో (పిడిలతో) నిరంతరం సమన్వయం చేసుకుంటూ జీవనోపాధి ప్రణాళికలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ శాఖల కార్యక్రమాలను ఎఫ్.పి.ఓలతో అనుసంధానం చేయడం ద్వారా రైతులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చాలని మంత్రి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సెర్ప్ కార్యదర్శి వాకాటి కరుణ, డిప్యూటీ సి.ఇ.ఓ శ్రీరాములు నాయుడు మరియు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media