AP:రాజమండ్రి కలుషిత పాల బాధితులకు అండగా ప్రభుత్వం

March 1, 2026 4:49 PM

కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలై రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య స్థితిగతులను వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని కిమ్స్, అపోలో, ఏఐజీ ఆసుపత్రుల నుంచి ప్రముఖ వైద్యులు (డాక్టర్ సుభాష్ కౌల్, క్రాంతి కుమార్ తదితరులు) ఈరోజు రాజమండ్రి చేరుకోనున్నారు. చౌడేశ్వరీ నగర్, స్వరూప్ నగర్‌లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 957 మందిని పరీక్షించగా, 110 ఇళ్లలోని 315 మంది రక్త నమూనాలను సేకరించారు. ఇందులో 313 మందికి ఫలితాలు సాధారణంగా వచ్చాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎమర్జెన్సీ వైద్య బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉండి ప్రతి రోజూ బాధితుల ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేస్తున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media