AP:బ్రాహ్మణుల సంక్షేమానికి ‘గరుడ’ పథకం మంత్రి సవిత

January 9, 2026 10:56 AM

రాష్ట్రంలోని నిరుపేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ‘గరుడ’ పథకాన్ని పునరుద్ధరించి, పేద బ్రాహ్మణ కుటుంబాలకు భరోసా కల్పిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు.

నిరుపేద బ్రాహ్మణులు మృతి చెందితే వారి కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి తెలిపారు. గతంలో ఉన్న ధూప దీప నైవేద్య పథకం గౌరవ వేతనాన్ని రూ. 3 వేల నుండి రూ. 7 వేలకు, నిర్వహణ ఖర్చులను రూ. 3 వేలకు పెంచుతూ జీవో జారీ చేసినట్లు పేర్కొన్నారు. దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల గౌరవ భృతిని రూ. 10 వేల నుండి రూ. 15 వేలకు, నిరుద్యోగ వేద పండితులకు రూ. 3 వేల భృతిని (సంభావన) అందజేస్తున్నట్లు వెల్లడించారు. బ్రాహ్మణుల్లో పేదరిక నిర్మూలన కోసం 2014లోనే సీఎం చంద్రబాబు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వం నిలిపివేసిన భారతి, గాయత్రి, చాణక్య వంటి 10 రకాల పథకాలను మళ్ళీ పట్టాలెక్కిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చిరాంప్రసాద్, ఎండీ చిన్నబాబు పాల్గొని పథకాల అమలుపై చర్చించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media