రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం పార్లమెంట్‌కు చేరుకున్నారు. వారికి టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో లోకేష్ భేటీ అయ్యారు. మరికాసేపట్లో మంత్రులు లోకేష్, అనిత.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లను కలవనున్నారు.
ఇటీవల ‘మొంథా’ తుఫాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టం అంచనాకు సంబంధించిన సమగ్ర నివేదికను ఈ కేంద్ర మంత్రులకు అందించనున్నారు.

