కూటమి ప్రభుత్వ పాలనలో గుడివాడ నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. సోమవారం గుడ్లవల్లేరు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, సుమారు రూ. 1.06 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.

గుడ్లవల్లేరు పంచాయతీ కార్యాలయ సమావేశ మందిర నిర్మాణానికి (రూ. 53 లక్షలు), చిత్రం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి (రూ. 34.50 లక్షలు) శంకుస్థాపన చేశారు. పెంజేండ్రలో రూ. 19 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. పెంజేండ్ర గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని, విజేతలకు బహుమతులు అందజేశారు.

గ్రామాల్లో సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లుగా పండుగ వాతావరణం నెలకొందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, కొత్త ఏడాదిలో గుడివాడను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి మరియు కూటమి పార్టీల నేతలు, అధికారులు పాల్గొన్నారు.
