చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నై నుంచి ముల్బాగల్ వైపు వెళ్తున్న ఓ ఈచర్ (Eicher) వాహనం క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి.
అర్ధరాత్రి 3 గంటల సమయంలో మొగిలి ఘాట్. ఈచర్ వాహనం క్యాబిన్‌లో మంటలు చెలరేగగా, దానిలో ఖాళీ టమాటా ట్రే ల లోడు ఉంది. మంటలు చెలరేగగానే డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై వెంటనే వాహనం నుంచి దూకేశారు, దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
సమాచారం అందుకున్న వెంటనే పలమనేరు ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ ఆఫీసర్ మనోహరన్ మరియు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
