తిరుపతి పరకామణి కేసు విచారణలో భాగంగా టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ ముందు హాజరయ్యారు. విచారణకు ముందు మీడియాతో మాట్లాడుతూ—
“ఈ కేసుతో నాకు భూమికి–నక్షత్రానికి ఉన్నంత తేడా ఉంది. నన్ను ఇరికించేందుకు బీఆర్ నాయుడు, భాను ప్రసాద్, లోకేష్, వర్ల రామయ్య, పట్టాభి పేర్లు చెబుతూ విచారణకు పిలిచారు” అని ఆరోపించారు. పచ్చ మీడియా తప్పుడు వార్తలు పంచుతోందని, కూటమి నేతల ఒత్తిడికి పోలీసులు లోనయ్యారన్నారు.
అలాగే పరకామణి కేసులో విచారణకు పిలిచిన టిటిడి మాజీ బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్ కూడా స్పందించారు.
“నవంబర్ 2021 నుంచి డిసెంబర్ 2023 వరకు మాత్రమే బోర్డు సభ్యునిగా ఉన్నాను. పరకామణి కేసు బోర్డులో పెట్టినప్పుడు నేను లేను. రాజకీయ ఒత్తిళ్లతో విచారణకు పిలుస్తున్నారు” అని అన్నారు.
శ్రీవారి ఒక్క నాయపైస అయినా ఎవరైనా దుర్వినియోగం చేస్తే దేవుడే శిక్షిస్తాడని అశోక్ తెలిపారు.
