AP:మైదుకూరులో’ రూ. 26 k వేతనం కోసం అంగన్‌వాడీల ధీక్ష

February 23, 2026 5:42 PM

తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (CITU) పిలుపు మేరకు మైదుకూరు ICDS ప్రాజెక్ట్ కార్యాలయం ముందు సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద, ఆపై 25, 26 తేదీల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు యూనియన్ ప్రకటించింది.

అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలి.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలుకు గైడ్‌లైన్స్ రూపొందించాలి.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలి.ఈ సందర్భంగా యూనియన్ నాయకురాళ్లు ధనలక్ష్మి, భారతి మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీలకు హామీలిచ్చిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక తమను విస్మరించడం అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ‘చలో విజయవాడ’ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ దీక్షల్లో రామతులసి, రమాదేవి, వరలక్ష్మి సహా పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.



ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media