AP:విద్యానగర్‌లో నేదురుమల్లి జయంతి వేడుకలు

February 21, 2026 1:28 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 91వ జయంతి వేడుకలు నెల్లూరు జిల్లాలో ఘనంగా జరిగాయి. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, నేదురుమల్లి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.

వాకాడులోని నేదురుమల్లి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్ కళాభవన్ లో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో రాంకుమార్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని రక్తదానం చేశారు. “నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకు కంటే, ఒక టీచర్ కొడుకు అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను” అని రాంకుమార్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యానగర్‌ను పూర్తిస్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే తన తండ్రి ఆశయమని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ కల నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు లక్ష్మీ నారాయణరెడ్డి, పార్టీ కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media