నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆయనకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీషా, ఆలయ ఈఓ శ్రీనానాయక్ ఘన స్వాగతం పలికారు.
సుబ్రహ్మణ్యం గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనను శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం మరియు ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
