పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యా శాఖ కమిషనర్ ఎస్. విజయరామరాజు అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం పాలకొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
కమిషనర్ పర్యటనలో భాగంగా—జిల్లాలో విద్యా వ్యవస్థ అమలు తీరు, పాఠశాలల మౌలిక వసతుల పరిస్థితి, విద్యా శాఖ ప్రభుత్వ పథకాల పురోగతి,బోధనా విధానాలు, విద్యా ప్రమాణాల మెరుగుదల చర్యలు
వంటి అంశాలపై జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు.
ప్రోటోకాల్‌లో భాగంగా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఐటిడిఏ అధికారులు కలిసి కమిషనర్‌కు స్వాగతం తెలిపారు.
