పల్నాడు జిల్లా మాచర్ల మండలం లింగాపురం కాలనీ బొంబాయి కంపెనీ బ్రిడ్జి మీద నుంచి దూకి వీర్ల గోవర్ధన్, దాసరి లక్ష్మి అనే ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పెద్ద కాలువలో దాసరి శ్రీలక్ష్మి మృతదేహం లభ్యం అయింది.
యువకుడు వీర్ల గోవర్ధన్ ఆచూకీ తెలియకపోవడంతో, పోలీసులు మరియు కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.
దర్యాప్తు: ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
