చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం లింగారావుపాలెం శివారులో పేకాట ఆడుతున్న పది మందిని ఎడ్లపాడు పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి ₹10,240 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంబంధంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
