దాచేపల్లి నగర పంచాయతీలోని మూడో వార్డులో నూతనంగా నిర్మించనున్న కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.
సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో 28 సెంట్ల స్థలంలో ఈ కల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు.
నియోజకవర్గంలో సామాజిక అభివృద్ధికి ఈ మండపం ఎంతగానో ఉపయోగపడుతుందని యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
