యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో “SAY NO TO DRUGS” నినాదంతో అచ్యుతాపురం నుండి కోర్టు కూడలి వరకు ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

మాదకద్రవ్యాలు కేవలం వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబాన్ని మరియు సమాజాన్ని నాశనం చేస్తాయని ఎమ్మెల్యే హెచ్చరించారు. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులు, యువత ముందుండాలని ఆయన కోరారు.
డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టెక్కలి డీఎస్పీ ఎల్. లక్ష్మణరావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఐదు మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

