గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం నారాకోడూరులో పర్యటించి, నూతన పంచాయతీ భవనం మరియు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ వడ్రాణం మార్కండేయబాబు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
