ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కల్యాణం శివ శ్రీనివాస్ సోమవారం (డిసెంబర్ 15) మంగళగిరిలోని ప్రైమ్ హిల్ క్రెస్ట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ. 509 కోట్ల వ్యయంతో అనేక పోలీస్ భవనాలను నిర్మించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు.

త్వరలోనే రూ. 412 కోట్లతో గ్రేహౌండ్స్కు సంబంధించిన నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. కార్పొరేషన్ ఎండీ రవిప్రకాష్ సారథ్యంలో అనేక నిర్మాణ పనులు విజయవంతంగా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

పోలీస్ సిబ్బందికి మెరుగైన మౌలిక వసతులు, భవనాలను అందించడంపై కార్పొరేషన్ దృష్టి సారించింది.
