అనంతపురం జిల్లాలో టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి తేజస్విని కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. లక్ష్మీనగర్‌లో పార్క్ చేసిన ఆమె కారును దుండగులు రాళ్లతో ధ్వంసం చేసిన ఘటనపై తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రత్యర్థులు దాడికి పాల్పడుతున్నారని, ఇది వైసీపీ కార్యకర్తల పనేననే అనుమానం ఉందని తేజస్విని మండిపడ్డారు. “ఒక ఆడబిడ్డపై ఇలాంటి దౌర్జన్యం ఎందుకు?” అంటూ ఆమె ప్రశ్నించారు. దమ్ముంటే ఎదురుగా రావాలని, దొంగ దాడులు సరికాదని సవాల్ విసిరారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీ కెమెరాల పరిశీలనలో నిందితులను త్వరలో గుర్తిస్తామని తెలిపారు. గతంలోనూ తేజస్విని కారుపై ఇలాంటి దాడి జరగడం గమనార్హం.

