మదనపల్లె మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో శనివారం వైసీపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వం 27 కోట్ల రూపాయలు ఖర్చుచేసి మెడికల్ కళాశాల నిర్మించిందని, అయినా కూడా నిరాధార ఆరోపణలు చేయడం తగదని నేతలు మండిపడ్డారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మెడికల్ కళాశాల వద్ద ఆధారాలు చూపుతామని వైసీపీ నాయకులు ప్రకటించడంతో అక్కడికి భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు.
ఈ సమయంలో టీడీపీ నాయకులు కూడా చేరడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కొంతమందిని చితకబాదిన ఘటనలు చోటుచేసుకోగా, ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెరో వైపుకు తరలించి పరిస్థితిని సద్దుమణిగించారు.
