గుంటూరు జిల్లా పొన్నూరులో సంచలనం రేపిన యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. ఈనెల 18న జరిగిన ఈ దారుణ ఘటనపై ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.
పొన్నూరు పట్టణంలోని 18వ వార్డులో బుధవారం (డిసెంబర్ 18) ఒక యువతిపై అత్యాచారం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే సీఐ వీరా నాయక్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

టెక్నికల్ ఎవిడెన్స్ మరియు సమాచారం ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని అర్బన్ సీఐ వీరా నాయక్ హెచ్చరించారు.
