ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారకులైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా, స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల వాసవి భవన్ ప్రాంగణంలో ఆయన శిలావిగ్రహానికి ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.

ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షులు నేతి శ్రీనువాసరావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి ఆధ్యుడు పొట్టి శ్రీరాములు కావడం ఆర్యవైశ్యులకు గర్వకారణమని నేతి శ్రీనువాసరావు పేర్కొన్నారు.58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అసువులు బాసిన త్యాగమూర్తి ఆయనని గుర్తు చేశారు.
ఆయన దేశభక్తి, నిరాడంబరత నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శమని కార్యదర్శి కట్టమూరి సూర్యనారాయణ అన్నారు.కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల శిలావిగ్రహం, స్మృతి వనం ఏర్పాటు చేస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు.
