Rajamahendravaramలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేసిన ఇద్దరు నర్సులపై చర్యలు తీసుకున్నారు.
మహిళా దినోత్సవం ముందు రోజు ఆసుపత్రి సెమినార్ హాల్‌లో కొందరు నర్సింగ్ సిబ్బంది ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విధి సమయంలో రోగులను నిర్లక్ష్యం చేసి డ్యాన్స్ చేశారన్న విమర్శలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.విచారణ అనంతరం హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరీలను సస్పెండ్ చేస్తూ Keerthi Chekuri ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా డ్యాన్స్‌ను ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
