శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారీ అఖండ ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో నీలమణి దుర్గమ్మ ఆలయం నుండి కేఎస్‌ఎం ప్లాజా వరకు జాతీయ జెండాలతో ర్యాలీ సాగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోవిందరావు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ—సర్దార్ పటేల్ నిర్మించిన అఖండ భారతానికి యూనిటీ మార్చ్ అర్పణగా నిలుస్తోందని, ప్రజల్లో జాతీయ ఐక్యత, సమగ్రత, సౌహార్దాన్ని పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.

ర్యాలీ శాంతియుతంగా, ఉత్సాహంగా సాగిందని BJP జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

