Rapurలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలకు వచ్చిన గర్భవతులకు ఉచిత పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ హర్ష ఆధ్వర్యంలో, నెల్లూరులోని బాలాజీ హోమ్ కేర్ హెల్త్ సర్వీసెస్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అర్షియా మాట్లాడుతూ ప్రతి నెల 9వ తేదీన వైద్య పరీక్షలకు వచ్చే గర్భవతులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. దూర ప్రాంతం నుంచి వచ్చి గర్భవతులకు పౌష్టికాహారం అందిస్తున్న బాలాజీ హోమ్ కేర్ నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మరియు బాలాజీ హోమ్ కేర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
