పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులకు పెన్షన్లతో పాటు వైద్య రాయితీలు మరియు ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని ఆల్ ఇండియా రిటైర్డ్ జడ్జీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఋషికొండలో గల ఒక రిసార్ట్‌లో ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జీస్ అసోసియేషన్ 17వ జాతీయ సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మాజీ న్యాయమూర్తులు హాజరయ్యారు. ఆల్ ఇండియా రిటైర్డ్ జడ్జీస్ అసోసియేషన్ అధ్యక్షులు సుకుమారన్, కార్యదర్శి కుమారన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
విశాఖ జిల్లా కోర్టు న్యాయమూర్తులు చెన్నం శెట్టి రాజు, జగన్నాథం నాయుడులు పాల్గొని ప్రసంగించారు. న్యాయమూర్తులు తమ సర్వీస్ కాలంలో అందించిన సేవలను గుర్తుచేస్తూ, పదవీ విరమణ అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా వైద్య సౌకర్యాల కల్పనలో ప్రభుత్వాలు తగిన రాయితీలు ఇవ్వాలని తీర్మానించారు
