AP :రెవెన్యూ శాఖలో కలకలం CM ఆదేశాలను ధిక్కరించిన సబ్-రిజిస్ట్రార్

December 2, 2025 3:08 PM

చిత్తూరు జిల్లా, రేణిగుంట అవినీతి, అక్రమ భూముల రిజిస్ట్రేషన్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్-రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డి వ్యవహారం రెవెన్యూ శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి ఆదేశాలను ధిక్కరించి తిరిగి పోస్టింగ్ పొందడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలోనే అక్రమ భూములు (ప్రభుత్వ భూములు, చెరువులు, వంకలు) రిజిస్ట్రేషన్లు చేయటం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టడం వంటి ఆరోపణలతో ఆనంద్ రెడ్డి ప్రొబేషన్‌ను సీఎం ఆమోదంతో రద్దు చేయడం జరిగింది.

డిప్యుటేషన్ డ్రామా అయితే, ఇటీవల ఆయన రెవెన్యూ మంత్రి మరియు స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల మద్దతుతో డిప్యూటేషన్ పద్ధతిలో తిరిగి రేణిగుంట సబ్-రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టడం వివాదాస్పదమైంది.

ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి పోవడంతో, ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణం డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. దీంతో సబ్-రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డి మరోసారి పై అధికారుల ఆదేశాల మేరకు బాధ్యతల నుంచి ఉపక్రమించారు.

విమానాశ్రయం, జాతీయ రహదారుల కారణంగా రేణిగుంటలో భూముల విలువ, డిమాండ్ అధికంగా ఉండటంతో, ఈ పోస్ట్ కోసం రాజకీయ నేతల సిఫార్సులతో పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.అలాగే ఈ విషయం లో డిప్యూటేషన్ మీద ఉన్న వ్యక్తిపై కుల వివక్ష చూపుతున్నారని ప్రతిపక్షాల విమర్శ, టీడీపీ హేయము లో కుల వివక్ష పెరిగిందనే విషయం ఇటీవల AP లో జరిగిన సంఘటనలు వల్ల తెలుస్తుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media