రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె ప్రజలకు శుభవార్త తెలిపారు. గ్రామీణ రహదారుల స్థితిగతులు, నిర్మాణ నాణ్యత, పనుల పురోగతి గురించి ప్రజలకు నేరుగా సమాచారం అందించేందుకు ప్రభుత్వం ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ (Geo Rural Road Management System) ను ప్రవేశపెట్టనుంది.
పవన్ కళ్యాణ్ వెల్లడించిన ప్రకారం, ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమం కింద ₹2,123 కోట్ల సాస్కీ నిధులతో 4,007 కిలోమీటర్ల రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు పల్లెల మౌలిక సదుపాయాల అభివృద్ధి కి గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయనున్నాయని ఆయన తెలిపారు.

