AP:సత్తెనపల్లిలో ఘనంగా మహిళా దినోత్సవం..video

March 9, 2026 2:07 PM

Sattenapalli వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సత్తెనపల్లి ఎమ్మెల్యే Kanna Lakshminarayana ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళాభ్యుదయమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు కుటుంబం మాత్రమే కాకుండా సమాజం, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి N. Chandrababu Naidu మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ డ్వాక్రా రుణాల పరిమితి పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, “తల్లికి వందనం” వంటి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media